Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

రసవత్తరంగా మారిన బిగ్‌బాస్‌2

నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌ చేస్తోన్న 'బిగ్‌బాస్‌ సీజన్‌ 2' చివరి దశకు వచ్చేసరికి ఉత్కంఠభరితంగా మారుతోంది. సామాన్యుని కోటాలో హౌస్‌లోకి ప్రవేశించిన గణేష్‌ని ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేస్తూ కౌశల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గణేష్‌ సోమరిపోతు అని, సమయం దొరికితే చాలు నిద్ర పోతూ ఉంటాడని వ్యాఖ్యానించాడు. ఆట ఆడటానికి బదులు మాటలు చెబుతూ హౌస్‌లో నెట్టుకొస్తున్నాడని తీవ్ర పదంజాలం వాడాడు. కౌశల్‌ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన గణేష్‌ అతని వ్యాఖ్యల్లో ఎంత మాత్రము నిజం లేదన్నాడు. కౌశల్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పుకొచ్చాడు. 

కాగా ఈ వారం కూడా కౌశల్‌ నామినేట్‌ అయ్యాడు. ఎలిమినేషన్‌ రౌండ్‌లోకి నామినేట్‌ అయిన వారిలో సామ్రాట్‌, గణేష్‌, నూతన్‌నాయుడు, అమిత్‌లు ఉన్నారు. ఈసారి మహిళలల్లో ఒకరు కూడా నామినేట్‌ కాకపోవడం విశేషం. 

ఇక కౌశల్‌ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్‌బాస్‌ అండతోనే కౌశల్‌ అందరినీ టార్గెట్‌ చేస్తున్నాడని, అదే సమయంలో తన అభిమానుల్లో ఓటింగ్‌ శాతం పెంచుకునేందుకు డబుల్‌గేమ్‌ ఆడుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరికొందరేమో కౌశల్‌ ఈ బిగ్‌బాస్‌ సీజన్‌2కి విజేత కావడం ఖాయమని, ఆ విధంగానే ముందు నుంచి పావులు కదులుతున్నాయని అంటున్నారు. 



from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2ok4PGZ

Yorum Gönder

0 Yorumlar